కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ. 3.00 కు తదుపరి త్రయోదశి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: చిత్త 21 తె. 5.09 కు తదుపరి స్వాతి
యోగం: సిద్ధి మ. 12.11 కు తదుపరి వ్యతీపాత
కరణం: బాలవ మ. 03.58 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.39 - 01.31 కు & మ. 03.15 - 04.07 కు
వర్జ్యం: మ. 11.35 - 1.20 కు
అమృతకాలం: రా. 10.09 - 11.54 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు
గురుబోధ:
చిత్తశుద్ధితో ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు తగిన ఫలితము పరమాత్మ ఇచ్చి తీరుతాడు. మనము అర్హులము అవ్వాలంటే పవిత్రమైన చిత్తముతో చేయాలి. దాని ఫలితం ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. పరమాత్మ ముందు పాతకర్మ అంతా తొలగిస్తాడు. పూర్వకర్మలన్నీ కష్టాలరూపంలో, దుఃఖముల రూపముతో వదిలించుకుంటే అప్పుడు మనము బంగారునగ లాగా భాసిస్తాము. పరమాత్ముని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే, ముందు భగవంతుడు పెట్టే పరీక్షలలో, కష్టాల్లో నెగ్గాలి. కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం ప్రదక్షిణలు, ఉపాసన చేయడం, పురాణాలు వినడం, చేయవలసిన వ్రతాలు, దానాలు చేయాలి. అవి చేయడం వలన ఇవాళ కాకపోతే రేపు ఇంకొక రీతిలో ఆ కోరిక తీరుతుంది.