May 20 2023మే 20 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : పాడ్యమి రా. 08గం౹౹33ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : కృత్తిక ఉ. 07గం౹౹39ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : అతిగండ సా. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  కింస్తుఘ్న ఉ. 09గం౹౹22ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹30ని౹౹ నుండి 07గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : రా. 12గం౹౹13ని౹౹ నుండి 01గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹12ని౹౹ నుండి 06గం౹౹59ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹22ని౹౹కు


గురుబోధ
శ్లో|| కరవీర! వృషావాస! నమస్తే భానువల్లభ!
      దంభోళి మృడ దుర్గాది దేవానాం సతతం ప్రియం! 
జ్యేష్ఠ శుక్లపాడ్యమినాడు దేవాలయ సంబంధమైన ప్రాంతంలో పూచిన గన్నేరు పువ్వును గంధం, కుంకుమ జల్లి భక్తితో నమస్కరించి ఈ పై శ్లోకం చదువుకోవాలి. ఇలా పలికి, ఆ పుష్పాన్ని ఆ ప్రాంగణమునకు చెందిన అర్చకులకు లేక పురోహితులకు దానం చెయ్యాలి. ఇలా చేసిన వారికి అద్భుతమైన ఆధ్యాత్మికజ్ఞానం, జ్ఞాపకశక్తి లభిస్తాయి.
            
expand_less