May 19 2024మే 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి మ. 1.09 కు తదుపరి ద్వాదశి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త రా. 2.48 కు తదుపరి చిత్త
యోగం: వజ్ర ఉ. 11.25 కు తదుపరి సిద్ధి
కరణం: విష్టి మ. 01.50 కు తదుపరి బవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.59 - 05.51 కు
వర్జ్యం: ఉ. 9.32 - 11.18 కు
అమృతకాలం: రా. 8.10 - 9.56 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు

🕉️వైశాఖ శుక్ల ఏకాదశి - మోహినీ ఏకాదశి, బృహస్పతి జయంతి, కంచి వరదరాజస్వామి ఆవిర్భావం, అన్నవరం శ్రీ సత్యదేవుని కల్యాణం🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
ఈరోజు శివుడిని ద్రవ్యాలతో అభిషేకం చేయండి, విష్ణువునైతే గంధాలతో పూజించండి. షోడశ ఉపచారములు తప్పక చేయండి, శక్తిని అనుసరించి ఉపవాసం ఉండండి.
ఉపవాసము ఉన్న తర్వాత దానం చేయటం మంచిది కనుక స్వయంపాకం, స్వర్ణము, వెండి, వస్త్రాలు మొదలగునవి దానం చేయటం మంచిది.
మోహినీతిథి నాడు గురుపత్నికి గాని, అర్చకుల పత్నులకు గాని, మీ పురోహితుల భార్యలకు కానీ ఒక మంచి చీరను దానము చేస్తే మోహినీ రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.

శ్రీ వాసుదేవ శత నామాలు*👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX

expand_less