" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 19 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : అమావాస్య రా. 08గం౹౹39ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : భరణి ఉ. 07గం౹౹16ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : శోభన సా. 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : చతుష్పాద ఉ. 09గం౹౹29ని౹౹ వరకు తదుపరి నాగ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹56ని౹౹ వరకు & మ. 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹27ని౹౹ నుండి 09గం౹౹14ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹35ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹21ని౹౹కు 🕉️శనైశ్చర జన్మతిథి, హనుమంతుడు బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి వరము పొందిన రోజు🕉️ గురుబోధ పూర్వం సూర్య భగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖ మాసం అమావాస్య నాడు జన్మించాడు అందుకే వైశాఖ అమావాస్య శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడం. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని (శనైశ్చరుడుకి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చొని) అనగా కోణంలో కూర్చోవాలి. శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం | ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం || అనే శ్లోకాన్ని చదువుకోవాలి. వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోడానికి ఆకాశానికి ఎగిరాడు, బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి అనేక వరములు పొందాడు కాబట్టి ఏదైనా హనుమంతుని స్తోత్రము చదువుకొని, కథ వినాలి.