కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 18 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.9.11 కు తదుపరి తదియ 19 సా.6.45 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రోహిణి మ.2.31 కు తదుపరి మృగశిర 19 మ.12.50 కు
యోగం: సుకర్మ రా.9:47 కు తదుపరి శూల 19 మ.2:09 కు
కరణం: కౌలవ సా.5:53 కు తదుపరి గరజి 19 మ.2:18 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 1.29 కు, మ. 3.12 - 4.03 కు
వర్జ్యం: ఉ.7.03 - 8.32 కు, రా.7.43 - 9.12 కు
అమృతకాలం: ఉ. 08.43 - 10.07 కు తదుపరి తె. 12.54 - 02.19 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
గురుబోధ:
జ్యేష్ఠమాసంలో మొదటి సోమవారం ప్రదోషవేళ మల్లెపూలతో శివునికి అభిషేకం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial