May 18 2024మే 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి ఉ. 11.06 కు తదుపరి ఏకాదశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తర రా. 12.14 కు తదుపరి హస్త
యోగం: హర్షణ ఉ. 10.25 కు తదుపరి వజ్ర
కరణం: గరజి ఉ. 11.22 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.43 - 07.27 కు
వర్జ్యం: ఉ. 5.43 - 7.22 కు
అమృతకాలం: సా. 4.14 - 6.00 కు
సూర్యోదయం: ఉ. 5.43 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు

🕉️వైశాఖ శుక్ల దశమి - పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిగిన పుణ్య తిథి🕉️

గురుబోధ

శ్లో|| దశమ్యాం మాధవే శుక్లే విష్ణుమభ్యర్చ మానవః|
లభతే వైష్ణవం లోకం నాత్ర కార్యా విచారణా ||

వైశాఖ శుక్ల దశమి నాడు విష్ణువును భక్తితో అర్చించిన మానవుడికి విష్ణులోకం లభిస్తుంది. ఏ సందేహం అక్కరలేదని, వైశాఖం నా సన్నిధినిచ్చే మాసం అనీ శ్రీహరి నారదునితో అంటాడు. శ్రీనివాసకల్యాణ ఘట్టం తప్పక వినడం సర్వమంగళదాయకం, సకలశుభప్రదం. వివాహం, అనుకూల దాంపత్యం, ఉద్యోగప్రాప్తి వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయి.

expand_less