" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 18 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : చతుర్దశి రా. 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : అశ్విని ఉ. 06గం౹౹58ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : సౌభాగ్య రా. 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : విష్టి ఉ. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు వర్జ్యం : సా. 04గం౹౹41ని౹౹ నుండి 06గం౹౹18ని౹౹ వరకు అమృతకాలం : రా. 02గం౹౹24ని౹౹ నుండి 04గం౹౹01ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹31ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹21ని౹౹కు 🕉️మాసశివరాత్రి🕉️ గురుబోధ ప్రపంచంలో దేన్నైనా జయించగలం కానీ అనుభవించి తీరవలసిన ఈ కర్మని ఎవరూ తప్పించుకోలేరు. కానీ భగవంతుని స్మరణ చేస్తే, పరమేశ్వరుడిని గట్టిగా పట్టుకుంటే, తీవ్రంగా అనుభవించవలసిన కర్మ కొంచెం తక్కువగా అనుభవిస్తాం. అనగా ఒకనికి ప్రారబ్ధకర్మ ప్రకారం ఈ రోజు తల తెగి చనిపోవాలని ఉంటే, అతను పరమేశ్వరుడిని పూజిస్తే, ఏ వేలో తెగి గండం నుంచి బయటపడతాడు. శివనామస్మరణం చెయ్యడం ఎంత గొప్పదో, వినడం కూడా అంతే గొప్పది. శివుని నామం భక్తితో స్మరించాలి. ఈ శివనామస్మరణం సూర్యకాంతి వంటిది. సూర్యుని కాంతి రాగానే చీకట్లు తొలగిపోతాయి. మనం సంసారంలో చేసిన మహాపాపములనే, కష్టములనే చీకట్లు శివుని నామస్మరణమనే సూర్యకాంతితో తొలగిపోతాయి. అందుకే "మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా" అన్నామంటే మృత్యువు మనకి భృత్యువు అవుతుంది, అప్పుడు మనకి దుర్మరణం రాదు. విడిచిపెట్టకుండా ఒక మాసంపాటు (నెలరోజులు) తులసీదళములతో ఈశ్వరునికి (శివలింగమునకు) పూజ చేస్తే ముందు భుక్తి, తరువాత ముక్తి లభిస్తుంది. అలాగే గంగానదీ జలముతో ధారగా అభిషేకిస్తే కూడా భుక్తి, ముక్తి కలుగుతాయి.