కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: నవమి ఉ. 9.06 కు తదుపరి దశమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుబ్బ రా. 9.37 కు తదుపరి ఉత్తర
యోగం: వ్యాఘాత ఉ. 08.21 కు తదుపరి హర్షణ ఉ. 10.25 కు
కరణం: కౌలవ ఉ. 08.48 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.19 - 09.11 కు & మ. 12.39 - 01.31 కు
వర్జ్యం: తె. 5.36 - 7.06 కు
అమృతకాలం: మ. 2.32 - 4.18 కు
సూర్యోదయం: ఉ. 5.44 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు
🕉️వైశాఖ శుక్ల నవమి🕉️
గురుబోధ
ఎన్నో జన్మల సంస్కారము, పుణ్యఫలం ఉంటే కానీ సద్గురువుల ఆశ్రయం పొందలేము. ఒకవేళ పొందినా దైవానుగ్రహం లేకపోతే నిలబెట్టుకోలేము. కొందరు తమ పాపం పెరిగి గురువులను అనుమానించడం, అవమానపరచడం చేసి భ్రష్టులవుతారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన గురువైన శ్రీ సమర్థ రామదాసు గారి దర్శనం కోసం, మంత్రోపదేశం తీసుకోవడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారి దర్శనం దొరకలేదు. సమర్థులు ఎంతో పరీక్షించారు. అయినా నిరాశ చెందకుండా శివాజీమహరాజ్ మొండిగా ప్రయత్నించి చివరికి వైశాఖ శుక్ల నవమి నాడు దర్శనం చేసుకుని మంత్రోపదేశం తీసుకున్నారు. వారి ఇరువురి కలయిక వల్లనే మన సనాతన ధర్మము, ఆలయాలు ఈ మాత్రం అన్నా ఉద్ధరించబడ్డాయి. అదే క్షణికోద్రేకం లేదా రాజునన్న అహంకారం శివాజీ మహరాజ్ కి ఉండి ఉంటే వారు గురువులను కలిసేవారా? ఇంతటి అఖండ భారత దేశం మనకు దక్కేదా? అందుకే శివాజీ మహారాజ్ మనకు ప్రాత:స్మరణీయుడు. ఆధ్యాత్మికసాధనలో ఎంతో సహనం అవసరం.