కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 16 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా.1.58 కు తదుపరి శు.పాడ్యమి 17 రా.11.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: భరణి సా.5.39 కు తదుపరి కృత్తిక 17 సా.4.08 కు
యోగం: శోభన ఉ.6:15 కు తదుపరి అతిగండ 17 రా.1:59 కు
కరణం: చతుష్పాద మ.3:23 కు తదుపరి కింస్తుఘ్న 17 ఉ.11:36 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.30 - 8.21 కు
వర్జ్యం: తె.4.53 - 17 ఉ.6.23 కు
అమృతకాలం: మ. 01.15 - 02.40 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
శనైశ్చర జన్మతిథి, హనుమంతుడు బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి వరము పొందిన రోజు
గురుబోధ:
పూర్వం సూర్యభగవానుడికి, ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖమాసం అమావాస్య నాడు జన్మించాడు. అందుకే వైశాఖ అమావాస్య శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడం. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వడం లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని (శనైశ్చరుడుకి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చొని) అనగా కోణంలో కూర్చోవాలి.
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం || అనే శ్లోకాన్ని చదువుకోవాలి.
వైశాఖమాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు, బ్రహ్మ మఱియు సకల దేవతల నుండి అనేక వరములు పొందాడు కాబట్టి ఏదైనా హనుమంతుని స్తోత్రము చదువుకొని, కథ వినాలి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial