May 15 2025మే 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ రా.3.43 కు తదుపరి చతుర్థి 16 తె.4.24 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ.12.23 కు తదుపరి మూల 16 మ.2.00 కు
యోగం: శివ ఉ.7:01 కు తదుపరి సిద్ధ 16 ఉ.7:14 కు
కరణం: వణిజ మ.3.19 కు తదుపరి విష్టి తె.4.03 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:04-10:55 కు, మ. 3:11-4:03 కు
వర్జ్యం: రా.8.54-10.36 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5:32 కు
సూర్యాస్తమయం: సా. 6:19 కు

🕉️ సరస్వతీ నది పుష్కరాలు ఆరంభం - మే 15 నుండి మే 26 వరకు🕉️
🕉️ వృషభ సంక్రమణము 🕉️
వృషభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపదపుణ్యకాలము ప్రారంభం: ఉ.05:42 కు, అంత్యము: మ.12:06 కు
మహాపుణ్యకాలము ప్రారంభం: ఉ.05:42 కు, అంత్యము: ఉ.06:59 కు

గురుబోధ:
నదిలో సబ్బులు, షాంపూలు వాడరాదు. నదిలో ప్లాస్టిక్ కవర్లను వేస్తే మహాపాపం. నదిలో కాని తీరంలో కాని ఉమ్మివేసినచో వికలాంగులవుతారు.
సంక్రాంతులు (సంక్రమణ సమయం), మాసశివరాత్రులు, గ్రహణం సమయాలలో చేసిన జపం, దానము, నామస్మరణం, స్తోత్రపారాయణం, అర్చన విశేషఫలితం ఇస్తాయి.

expand_less