May 15 2024మే 15 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి ఉ. 5.51 కు తదుపరి అష్టమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఆశ్లేష సా. 4.57 కు తదుపరి మఘ
యోగం: వృద్ధి ఉ. 07.42 కు తదుపరి ధ్రువ
కరణం: విష్టి మ. 05.17 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.47 - 12.39 కు
వర్జ్యం: తె. 5.07 - 6.37 కు
అమృతకాలం: మ. 3.12 - 4.55 కు
సూర్యోదయం: ఉ. 5.44 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు

🕉️ బుధాష్టమి 🕉️

గురుబోధ:
బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.

expand_less