" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 15 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : దశమి 15వ తేదీ తె. 03గం౹౹27ని౹౹ వరకు తదుపరి ఏకాదశి 15వ తేదీ రా. 01గం౹౹24ని౹౹ వరకు వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : పూర్వాభాద్ర ఉ. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం : విష్కంభ రా. 01గం౹౹30ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : బవ మ. 01గం౹౹52ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹09ని౹౹ నుండి 08గం౹౹40ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹33ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹20ని౹౹కు 🕉️వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి - వరూధినీ ఏకాదశి🕉️ ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము మంగళవారం చెయ్యాలి. గురుబోధ 1) వైశాఖ కృష్ణపక్ష ఏకాదశి ‘వరూధిని’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. 2) ఈరోజు ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. తరువాత హరి పూజ చేయాలి. హరి పూజ చేయని ఏకాదశి వ్రతం వృథా. 3) ఈరోజు విష్ణువుకు ప్రత్యేకంగా గంధం పూయాలి. భయంకరపాపాలు తొలగి మహాపుణ్యం లభిస్తుంది. గంధమును అరగదీసి విష్ణువిగ్రహం పైన లేదా సాలగ్రామం పైన పూయాలి. గంధం పూసాక షోడశోపచారపూజ చేయాలి. అనంతరం పుష్పములతో కానీ తులసీదళములతో కానీ బిల్వదళములతో కానీ విష్ణువు లేదా కృష్ణ అష్టోత్తరశతనామాలతో పూజించాలి. పురుషసూక్తం, శ్రీసూక్తం చదవాలి. ఏదైనా ఒక తీపిపదార్ధం నివేదించాలి.