May 14 2025మే 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ రా.2.33 కు తదుపరి తదియ 15 రా.3.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ ఉ.10.23 కు తదుపరి జ్యేష్ఠ 15 మ.12.23 కు
యోగం: పరిఘ ఉ.6:33 కు తదుపరి శివ 15 ఉ.7:01 కు
కరణం: తైతుల మ.1.35 కు తదుపరి గరజి రా.2.29 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:46-12:38 కు
వర్జ్యం: సా.4.26-6.08 కు
అమృతకాలం: రా.2.52-4.36 కు
సూర్యోదయం: ఉ. 5:32 కు
సూర్యాస్తమయం: సా. 6:19 కు

🕉️ వృషభ సంక్రమణం🕉️
పుణ్యకాలం: ఉ.05.49-మ.12.23 కు
మహాపుణ్యకాలం: ఉ.05.49-ఉ.08.01 కు

గురుబోధ:
సంక్రాంతులు (సంక్రమణ సమయం), మాసశివరాత్రులు, గ్రహణం సమయాలలో చేసిన జపం, దానము, నామస్మరణం, స్తోత్రపారాయణం, అర్చన విశేషఫలితం ఇస్తాయి.

వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇

https://youtu.be/UwFKCtE_fRU?si=DQgoexbXZ4OfVhvq

expand_less