May 14 2024మే 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి పూర్తి తదుపరి అష్టమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుష్యమి మ. 3.07 కు తదుపరి ఆశ్లేష
యోగం: గండ ఉ. 07.26 కు తదుపరి వృద్ధి
కరణం: గరజి మ. 03.29 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.20 - 09.11 కు & రా. 11.06 - 11.50 కు
వర్జ్యం: తె. 4.53 - 6.23 కు
అమృతకాలం: ఉ. 8.20 - 10.01 కు
సూర్యోదయం: ఉ. 5.44 కు
సూర్యాస్తమయం: సా. 6.41 కు

🕉️గంగామాత అవతరణము, శ్రీ భగీరథ జయంతి, వైశాఖ సప్తమి, శర్కరాసప్తమి, నర్మదానదిలో గంగామాత ప్రవేశిస్తుంది (శ్రీ స్కాందపురాణము)🕉️


గురుబోధ
👉వైశాఖశుక్లసప్తమీ తిథినాడు, జహ్నుమహర్షి గంగాదేవిని కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. ఈ రోజు నర్మదా నదిలో గంగ ప్రవేశిస్తుంది. ఈ తిథినాడు పంచదారతో చేసిన పిండివంటలు సూర్యునికి నివేదిస్తే, సకల దుఃఖాలు నశిస్తాయి. పుత్రసంతానం కలుగుతుంది.
👉ఈరోజు బాణలింగాన్ని ఆవుపాలతో పూజిస్తే, ఆ క్షీరాన్ని నెత్తిపై చల్లుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. , వేల జన్మల పాపాలు తొలగుతాయి.
👉ఈరోజు నర్మదా నదములో 3 కోట్ల నదులు చేరుతాయి. కావున ఈరోజు ఓంకారేశ్వరం లో ఉన్న నర్మదా నదములో స్నానం చేయాలి. లేదా శ్రీశైలం లో మల్లికార్జున స్వామి కి అభిషేకం చేసిన జలములు స్వీకరించినా వేల జన్మల పాపాలు పోతాయి.
👉శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.
నేడు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.

expand_less