May 14 2023మే 14 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము

తిథి : నవమి ఉ. 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : శతభిషం ఉ. 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : ఐంద్ర ఉ. 06గం౹౹35ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం :  వణిజ మ. 03గం౹౹43ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹39ని౹౹ నుండి 05గం౹౹30ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹29ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు 
అమృతకాలం : తె. 04గం౹౹46ని౹౹ నుండి 06గం౹౹14ని౹౹ వరకు & రా. 02గం౹౹31ని౹౹ నుండి 04గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹32ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹20ని౹౹కు

🕉️శ్రీ హనుమాన్ జన్మతిథి🕉️

గురుబోధ
హనుమాన్ జన్మతిథి నాడు చెయ్యవలసినివి:
గంధ సిందూరం, తమలపాకులతో ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయనమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః...వంటి అష్టోత్తర శతనామములతో పూజ, మన్యుసూక్తంతో హనుమంతుడ్ని అభిషేకించడం, ఓం హరిమర్కటమర్కటాయ నమః అనే హనుమంతుని ద్వాదశాక్షరమంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో జపం చేసుకోవడం, శ్రీరామ జయరామ జయజయ రామ అని రామ నామము చేయడం, హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణ చేస్తే వాడు జైలు నుండి కూడా బయటకు వస్తాడు, వాడు మహా సుఖం పొందుతాడు, వాడికి శివుడి సాక్షిగా సిద్ధి కలుగుతుంది. అప్పాలు నివేదిస్తే భక్తులకు అనేక శుభాలు కలుగుతాయి, హనుమ యొక్క విశేష అనుగ్రహం లభిస్తుంది.




expand_less