" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 13 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : అష్టమి ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి నవమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ధనిష్ఠ మ. 01గం౹౹00ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : బ్రహ్మ ఉ. 09గం౹౹23ని౹౹ వరకు తదుపరి ఐంద్ర కరణం : కౌలవ ఉ. 06గం౹౹50ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹14ని౹౹ వరకు అమృతకాలం : తె. 03గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹20ని౹౹కు గురుబోధ హనుమంతుని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే! హనుమంతుని శిరస్సు మీద విష్ణువు, వక్షస్థలం మీద ఈశ్వరుడు, పాద ప్రాంతంలో బ్రహ్మ ఉన్నారు. అతడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటూ శివుడు పార్వతిదేవికి హనుమంతుని వైభవం వివరించాడు. శ్లో|| బుద్ధిః బలం యశో ధైర్యం నిర్భయత్వం, అరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|| ఇది ఒక అద్భుతమైన శ్లోకం. బుద్ధి, బలం, కీర్తి, మనస్సులో కలతలేకుండుట, భయం లేకుండుట, రోగం లేకుండుట, చురుకుదనం, ఉపన్యాస పటుత్వం, ఇవన్నీ హనుమస్మరణ వల్ల జీవులకు కలుగుతాయి.