కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 12 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి ఉ.9.54 కు తదుపరి ఏకాదశి 13 ఉ.9.05 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.03 కు తదుపరి ఉత్తరాభాద్ర 13 రా.8.44 కు
యోగం: వైధృతి రా.11:19 కు తదుపరి ప్రీతి 13 సా.5:53 కు
కరణం: విష్టి మ.2:52 కు తదుపరి బాలవ 13 మ.1:30 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.22 - 9.13 కు, రా. 11.05 - 11.49 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 05.20 - 06.55 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
🕉️ వైశాఖ కృష్ణపక్ష దశమి - హనుమ జన్మతిథి🕉️
గురుబోధ:
ఈ రోజున భక్తులు చెయ్యవలసినవి:
🕉️హనుమంతుడి ప్రతిమకు లేదా పటముకు యథాశక్తి తమలపాకులతో అర్చన.
🕉️ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయనమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః వంటి అష్టోత్తర శతనామములతో పూజ.
🕉️మన్యుసూక్తంతో హనుమంతుడికి అభిషేకం.
🕉️ఓం హరిమర్కటమర్కటాయ నమః అనేది హనుమంతుని ద్వాదశాక్షరమంత్రము. ఈ పరమపవిత్రమైన మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతో జపం.
🕉️రాముడి నామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. శ్రీరామ జయరామ జయజయ రామ అని రామ నామము చేయడం.
🕉️హనుమాన్ చాలీసాను వంద సార్లు పారాయణ చేస్తే, వాడు జైలు నుండి కూడా బయటకు వస్తాడు, మహాసుఖం పొందుతాడు, వాడికి శివుడి సాక్షిగా సిద్ధి కలుగుతుంది.
🕉️అప్పాలు నివేదన
ఇవన్నీ భక్తిశ్రద్ధలతో చేసుకున్న వారికి సీతారామాంజనేయ అనుగ్రహం, అనేక శుభాలు కలుగుతాయి.
ఆంజనేయ అష్టోత్తరశతనామ స్తోత్రం👇
https://youtu.be/KCvspNFxw4o?si=d3gXQWSMfQb3OmG6
PDF👇
https://srivaddipartipadmakar.org/stotram/sri-anjaneya-ashtottara-satanamamulu
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial