May 12 2024మే 12 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి 13వ తేదీ తె. 4.26 కు తదుపరి షష్ఠి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆర్ద్ర మ. 12.52 కు తదుపరి పునర్వసు
యోగం: ధృతి ఉ. 08.34 కు తదుపరి శూల
కరణం: బవ మ. 01.57 కు తదుపరి బాలవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.57 - 05.48 కు
వర్జ్యం: రా. 1.18 - 2.58 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు

👉🕉️ శ్రీ శంకరభగవత్పాదుల వారి జయంతి , శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి, గాయత్రీమాత అవతరణము🕉️👈

👉 నేడు గురువులను ఈశ్వరస్వరూపంగా భావించి, త్రికరణశుద్ధిగా పూజించి, గురుసేవ చేసుకోవడం, శ్రీ శంకరభగవత్పాదుల వారిని పూజించి వారి అష్టోత్తరశతనామావళి, కొన్ని శంకరకృత స్తోత్రములు మరియు తోటకాష్టకము భక్తి శ్రద్ధలతో పారాయణ చేయడం అత్యంత శుభప్రదం, తప్పక పఠించాలని శాస్త్రం.

గురుబోధ:
శ్రీ భగవద్ రామానుజాచార్యులు (ఆరుద్ర నక్షత్రం) మఱియు శ్రీ ఆదిశంకరాచార్యులు (మృగశిర నక్షత్రం) ఇరువురి జన్మతిథి వైశాఖ శుక్లపంచమి. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జన్మనక్షత్రం నాడు జయంతి చేయగా స్మార్త సంప్రదాయం ప్రకారం జన్మ తిథిన జయంతి ఉత్సవాలు చేస్తారు. అందుకే వైశాఖమాసం ఆరుద్ర నక్షత్రం నాడు శ్రీ రామానుజుల జయంతి కాగా శుక్లపంచమి శ్రీ శంకర భగవత్ పాదుల జయంతి. అయితే ఈసారి రెండూ ఒకేరోజు రావడం మన అదృష్టం.
సనాతన వైదిక ధర్మమార్గాన్ని నిర్దేశించడానికి గురుస్వరూపుడిగా పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యునిగా అవతరించారు. ధర్మోద్ధరణ కొరకై అద్వైత సిద్ధాంతాలతో ఎన్నో భాష్యములు, స్తోత్రములు సరళంగా రచించారు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవింద స్తోత్రం లాంటి ఎన్నో గొప్ప స్తోత్రములను మనకు అందించారు. దేవీదేవతల మీద వారు చేసిన స్తోత్రాలు, వేద ఉపనిషత్తుల మీద భాష్యములు, ఇతర సాహిత్య గ్రంథరచనములు తెలుసుకుని అర్థం చేసుకోవడానికి జీవితకాలం కృషిచేసినా సరిపోదు. నేడే మరొక విశేషం, సాక్షాత్ ఆదిశేషుడే శ్రీ రామానుజాచార్యులుగా అవతరించారు. అటువంటి ఈ ఇద్దరు మహాత్ములు ప్రాతః స్మరణీయులు.

expand_less