" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 12 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : సప్తమి ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : శ్రవణం సా. 02గం౹౹44ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : శుక్ల మ. 12గం౹౹18ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : బవ ఉ. 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹07ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు వర్జ్యం : రా. 06గం౹౹26ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు అమృతకాలం : తె. 03గం౹౹21ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు & ఉ. 05గం౹౹33ని౹౹ నుండి 06గం౹౹32ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹19ని౹౹కు గురుబోధ పూర్వకాలంలో రథంతర కల్పంలో వేదవేదాంగపారంగతుడైన కశ్యప నామధేయుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పేరు సాధ్య. వారికి సంతానం లేదు. కశ్యపుడు ఈశ్వరభక్తుడు కనుక ఎంతో శ్రద్ధతో ఒకప్పుడు కైలాసపర్వతానికి వెళ్లి శివుని కోసం మహాతపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. “పరమేశ్వరా! నీ వంటి కొడుకుని పొందాలని ఒక కోరిక ఉన్నది. స్త్రీ పురుష సంభోగం వల్ల కాకుండా జన్మించే నీవంటి ఒక కొడుకుని దయతో మా ఇద్దరికీ ప్రసాదించు” అని ప్రార్ధించాడు కశ్యపుడు. శివుడు చిరునవ్వు నవ్వి “నావంటి వాడు సృష్టిలో మరొకడు లేడు. కాబట్టి నేనే నీకు కొడుకుగా పుడతాను. ఈ యుగంలో కాదు. భవిష్యత్తులో శ్వేతవరాహకల్పంలో అంజనా, కేసరి అనే పేర్లతో మీరు వానర దంపతులుగా పుడతారు. ఆ కాలంలో అంజనాదేవి నా కోసం తపస్సు చేస్తుంది. సకల దేవతా తేజస్సులను, నా తేజస్సును, పార్వతీ దేవి యొక్క అపూర్వమైన శక్తిని పుణికి పుచ్చుకుని నేనే మీ గర్భములో వానర వీరుడిగా పుడతాను. నవమ బ్రహ్మనవుతాను. తద్వారా మీ పేర్లు, అన్ని లోకాల్లో ఎన్ని కల్పములు గడిచినా శాశ్వతంగా ఉండిపోతాయి” అని ఈశ్వరుడు వరమిచ్చి అతడిని ఆశీర్వదించాడు. ఆనాటి ఆ కశ్యపుడే ఈనాటి శ్వేత వరాహ కల్పంలో కేసరిగా పుట్టాడు. అతని భార్య సాధ్య ఈ జన్మలో గౌతముడికి, అహల్యకి అంజనా అనే పేరుతో పుట్టి కుంజరుడికి, వింధ్యావళికి దత్త పుత్రికగా వెళ్లి, కేసరిని చేపట్టి, ఈశ్వరానుగ్రహంతో సంభోగం లేకుండా మహాతపస్సుతో వాయుదేవుడిచ్చిన వరం వల్ల ఆంజనేయుడిని కన్నది.