May 11 2025మే 11 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి రా.9.02 కు తదుపరి వైశాఖ పూర్ణిమ 12 రా.11.05 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: స్వాతి రా.5.26 కు తదుపరి విశాఖ పూర్తి
యోగం: వ్యతీపాత 12 తె.5:00 కు తదుపరి వరీయాన్ 13 ఉ.5:52 కు
కరణం: గరజి ఉ.6.47 కు తదుపరి వణిజ రా. 8.02 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:53-5:44 కు
వర్జ్యం: ఉ.9.00-10.46 కు
అమృతకాలం: రా.08:22-10:10 కు
సూర్యోదయం: ఉ. 5:34 కు
సూర్యాస్తమయం: సా. 6:18 కు

🕉️ వైశాఖ శుక్ల చతుర్దశి - నృసింహస్వామి ఆవిర్భావతిథి, శ్రీనృసింహచతుర్దశి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మతిథి 🕉️

గురుబోధ:
ఈ తిథినాడు నరసింహస్వామిని భక్తితో అర్చిస్తే ఏ విధమైన శత్రుపీడ ఉండదు. నృసింహ జయంతి రోజున ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి నాడు అందరం ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి తరిద్దాం. నరసింహస్వామి వారు అహోబలంలో తొమ్మిదిమంది నారసింహులుగా మనకు దర్శనమిస్తారు.
https://youtu.be/8oi3WWGoHHA

ఈరోజు పారాయణం చేయవలసిన నృసింహ కరావలంబ స్తోత్రం గురుదేవులు మనకి అందించిన యూట్యూబ్ లింక్👇🏻👇🏻
https://youtu.be/3erOO4Yn_Hs

expand_less