కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి 12వ తేదీ తె 4.26 కు తదుపరి పంచమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మృగశిర మ. 12.29 కు తదుపరి ఆర్ద్ర
యోగం: సుకర్మ ఉ. 10.03 కు తదుపరి ధృతి
కరణం: వణిజ మ. 02.21 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.46 - 07.29
వర్జ్యం: రా. 9.01-10.38
అమృతకాలం: రా. 2.43 - 4.20 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు
గురుబోధ:
దేవతా కార్యక్రమాలు, మంచి పనులు శ్రద్ధతో, మంచి మనసుతో చేయాలి. శ్రద్ధతో భగవత్ కథ వినేవాళ్ళు, శ్రద్ధతో అర్చన చేసేవాళ్ళు, శ్రద్ధతో దానం చేసేవాళ్ళు, శ్రద్ధతో భగవద్భజన చేసేవాళ్ళు మనసు లగ్నం చేసి చేయాలి ఇలా చేసిన పుణ్యాత్ములకు ఎప్పుడూ మంచి ఫలితములు వస్తాయి, శుభములే కలుగుతాయి. మనకి తెలియకుండానే మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. చేసే పని యందు శ్రద్ధ ఉండాలి. దేవాలయంలో ఏమేమి చేయకూడదు అంటే “వ్యర్థ వాదాః” అనవసర ప్రసంగాలు చేయకూడదు, ఏమి చేసినా శ్రద్ధతోనే చేయాలి. అలాంటి శ్రద్ధ కలిగినవారు భూలోకంలోనూ సుఖం పొందుతారు శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం పొందుతారు. మానసిక, శారీరిక, ఇంద్రియనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు సుఖం పొందుతారు. మనం ఏ పని కోసమైతే వెళ్ళామో కేవలం ఆ పని పట్లే శ్రద్ధ ఉండాలి. వేరే పనులు లేక విషయాల యందు దృష్టి ఉండకూడదు. పురాణశ్రవణం చేయడానికి వెళితే కేవలం పురాణం మీదే మన దృష్టి ఉండాలి. ఆ సమయంలో ఇతర విషయాల యందు ఆసక్తి ఉండకూడదు.