" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 11 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : షష్ఠి మ. 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఉత్తరాషాఢ సా. 04గం౹౹24ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : శుభ మ. 03గం౹౹17ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : వణిజ ఉ. 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మ. 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు అమృతకాలం : తె. 03గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹ వరకు & ఉ. 10గం౹౹24ని౹౹ నుండి 11గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹33ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹12ని౹౹కు గురుబోధ దేవతలు తాగే అమృతం, తాగిన వారిని కేవలం నాలుగు యుగముల పాటు అంటే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే ఈ నాలుగు యుగములకు మాత్రమే జరా మరణములు లేకుండా చేసి కాపాడుతుంది. అది ఆ అమృతం యొక్క లక్షణం. రామనామం అనే అమృతం, దీనికి అతీతమైన అమృతము. శాశ్వతముగా మానవుడికి జరామరణములు లేకుండా చేస్తుంది. అటువంటి రామనామామృతాన్ని ఆహారంగా తీసుకుంటాడు హనుమంతుడు. భౌతిక ఆహారంతో సంబంధం లేకుండా ఆరోగ్యం, బలం, జ్ఞానం, ఉత్సాహం ఇవ్వడమే కాకుండా కైవల్యం కూడా ప్రసాదించే రామనామం వంటి ఆహారం కంటే గొప్ప ఆహారం లేదు అన్నారు ఆదిశంకరాచార్యుల వారు తన ‘భుజంగ ప్రయాతము’లో! సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం || పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం || "ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింప జేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను" శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.