కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి ఉ.10.06 కు తదుపరి నవమి 11 ఉ.10.16 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.8.18 కు తదుపరి శతభిషం 11 రా.8.55 కు
యోగం: బ్రహ్మ రా.2:08 కు తదుపరి ఐంద్ర 11 రా.1:04 కు
కరణం: కౌలవ మ.3:07 కు తదుపరి గరజి 11 మ.3:25 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 4.53 - 5.44 కు
వర్జ్యం: తె.3.41 - 5.19 కు
అమృతకాలం: మ. 01.47 - 03.29 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
గురుబోధ:
ఆదివారం నాటి అష్టమీతిథి కాలభైరవునికి అత్యంత ప్రీతికరం. కాలభైరవుడికి అష్టమి, అమావాస్య, ఆదివారం, బుధవారం కూడా ఇష్టం. అందులో ఆదివారం అష్టమి వచ్చినప్పుడు గాని బుధవారం అష్టమి వచ్చినప్పుడు గాని పూజిస్తే అనేక శక్తులు లభిస్తాయి. అష్టభైరవులలో ఒకరైన క్రోధభైర్వుడు సంప్రీతుడై స్థిరమైన ఉద్యోగం ప్రసాదిస్తాడు. అనారోగ్యాలన్నీ దూరమవుతాయి. అష్టసిద్ధులు మనకి లభించి, మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి.
కాలభైరవాష్టకం 11సార్లు👇
https://youtu.be/nCOJ1NFWpQQ?si=AOkkwtfu2RJUpJ8_https://youtu.be/nCOJ1NFWpQQ?si=AOkkwtfu2RJUpJ8_
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial