May 10 2024మే 10 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ 11వ తేదీ తె. 4.55 కు తదుపరి చతుర్థి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రోహిణి మ. 12.35 కు తదుపరి మృగశిర
యోగం: అతిగండ మ. 12.07 కు తదుపరి సుకర్మ
కరణం: తైతుల మ. 03.29 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.21 - 09.12 కు & మ. 12.38 - 01.30 కు
వర్జ్యం: తె. 4.49 - 6.19 కు & సా. 6.09 - 7.45 కు
అమృతకాలం: తె. 3.44 - 5.19 కు & ఉ. 9.28 - 11.02 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు

🕉️ పరశురామ జయంతి, శైవమత స్థాపకుడు శ్రీ బసవేశ్వర స్వామి జయంతి, అక్షయ తృతీయ, సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవం దర్శనం, త్రేతాయుగాది, వ్యాసుడు చెప్తుండగా మహాభారతం గణేశుడు వ్రాయడం మొదలుపెట్టిన పుణ్య తిథి 🕉️

👉 లక్ష్మీనారాయణ పూజ, యమధర్మరాజ ప్రీత్యర్థం శివ కేశవ అష్టోత్తర పారాయణం, సకలదేవతాస్వరూపమైన గోవును పూజించడం, గోసేవ వలన అనంత శుభఫలితాలు

గురుబోధ:
వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. ఈ తిథిని సౌభాగ్య తిథి అని కూడా అంటారు.
చేయవలసిన విధివిధానాలు
యమధర్మరాజకృత శివకేశవాష్టోత్తర శతనామాలను చదివి శివకేశవులను పూజించాలి.
అక్షయ తృతీయ నాడు శాస్త్రప్రామాణికంగా బంగారం కొనడం లేదా కొనవద్దని చెప్పలేదు. దానం చేయమని, చేస్తే మంచిది అని చెప్పారు. అయితే దొంగ బంగారం లేదా మోసం చేసి సంపాదించిన బంగారం లేదా శుద్ధి చేయని బంగారంలో మాత్రమే కలి పురుషుడు ఉంటాడు. (ధర్మరాజుకి మనవడు, అంతటి గొప్ప పరీక్షిత్ మహారాజు జరాసంధుడు ధరించి విడిచిన కిరీటం ఆ రోజు ధరించడం వలననే శమీకమహర్షి మీద చచ్చిన పాముని వేసి శృంగి శాపం చేత మరణించాడు. అందుకే తప్పక బంగారం శుద్ధి చేసి ధరించాలని శాస్త్రం. కష్టపడి సంపాదించిన బంగారంలో కలిపురుషుడు ఉండడు.
లలితాదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
స్వయంపాకం దానం ఇవ్వాలి. గుమ్మడికాయలు, ఆనపకాయ వంటి కూరలతో కలిపి దానం ఇవ్వడం మంచిది. బియ్యం, సువర్ణం, రజతం, వంటివి శక్తి కొలది దానం చేసుకుంటే అమ్మవారు అక్షయఫలితం ఇస్తుంది.
ముత్తైదువలకు పూజ చేసి, శక్తి కొలది దానం చేయటం వలన స్త్రీ పురుషులు ఇద్దరూ సౌభాగ్యంతో ఉంటారు. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు.
నవగ్రహాలకు 27 కానీ, 108 కానీ ప్రదక్షిణలు చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి.
* గురువులను, తల్లిదండ్రులకు పూజించి ప్రదక్షిణ చేయటం మంచిది.

https://youtu.be/1MoC79bhXT0?si=2pO_X4vjHsciGhFW

https://srivaddipartipadmakar.org/stotram/sri-sivakesava-ashtothara-shatanamavali-yamadharmaraja-kritham/pcatid/108/

expand_less