May 10 2023మే 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము

తిథి : పంచమి మ. 03గం౹౹25ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : పూర్వాషాఢ సా. 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : సాధ్య సా. 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం :  తైతుల మ. 01గం౹౹49ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹51ని౹౹ వరకు & రా. 01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹55ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹34ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹18ని౹౹కు


గురుబోధ
మానవ ప్రయత్నం చేసేటప్పుడు, ఆ ప్రయత్నానికి దైవబలం తోడు అవ్వకపోతే ఆ ప్రయత్నం సఫలీకృతం కాదు. మానవ ప్రయత్నానికి దేవతల అనుగ్రహం ఖచ్ఛితంగా లభిస్తేనే ప్రయత్నం సఫలం అవుతుంది. దేవతల అనుగ్రహం మంత్రం ద్వారా సిద్ధిస్తుంది. ఈ దేవతానుగ్రహాన్ని మంత్రం ద్వారా మనకు అందించే వారే గురువు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. మంత్రోపదేశం చేసినవారు మాత్రేమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రేమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా గురుధిక్కారంతో నశించిపోతుంది.

expand_less