May 09 2024మే 09 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: పాడ్యమి ఉ. 7.09 కు తదుపరి విదియ
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక మ. 1.06 కు తదుపరి రోహిణి
యోగం: శోభన మ. 02.42 కు తదుపరి అతిగండ
కరణం: బవ తె. 06.21 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.55 కు & మ. 03.13 - 04.05 కు
వర్జ్యం: తె. 4.45 - 6.15 కు
అమృతకాలం: ఉ. 10.48 - 12.20 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు

గురుబోధ:
వైశాఖమాసాన్ని మాధవమాసం అని అంటారు. తెల్లవారుజామున వామన నామస్మరణతో నిద్రలేచినచో మనస్సుకి చురుకుదనం వస్తుంది. సాధ్యమైనంతవరకు చన్నీటి స్నానం మంచిది. ఎవరికైనా మామిడిపండుతో భోజనం పెడితే ఉత్తమ జన్మప్రాప్తి, తాటి ఆకు విసనకఱ్ఱ దానం చేస్తే శరీరం విడిచాక స్వర్గంలో ఇంద్రుడు కల్పవృక్షంలో నుండి ఒక పండు ఇస్తాడు. శయ్యాదానం వల్ల భవిష్యత్తు జన్మల్లో భార్యాభర్తలకి ఎడబాటురాదు. ఈ మాసంలో వామనావతార, క్షీరసాగరమధన ఘట్టాలు వినాలి, హనుమంతుడ్ని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.

https://youtu.be/KCvspNFxw4o?si=5ylvho0c4l0HfjiX

expand_less