May 09 2023మే 09 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 09 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము

తిథి : చతుర్థి సా. 05గం౹౹34ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : మూల రా. 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : సిద్ధ రా. 09గం౹౹16ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  బాలవ సా. 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & రా. 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹34ని౹౹ వరకు & సా. 05గం౹౹46ని౹౹ నుండి 07గం౹౹17ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹12ని౹౹ నుండి 02గం౹౹43ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹34ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹18ని౹౹కు


🕉️భౌమచతుర్థి🕉️

గురుబోధ
మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణసంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.



expand_less