"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 09 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: అష్టమి మధ్యాహ్నం 02గం౹౹01ని వరకు తదుపరి నవమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: ఆశ్లేష ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹13ని౹౹ వరకు తదుపరి మఘ యోగం: వృద్ధి ఈ రోజు రాత్రి 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి ధ్రువ కరణం : విష్టి ఈ రోజు ఉదయం 05గం౹౹50ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం 2గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు వర్జ్యం: ఈ రోజు రాత్రి 02గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు అమృతకాలం: ఈ రోజు ఉదయం 11గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹12౹౹వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని౹౹ గురుబోధ:- వైశాఖ శుద్ధ అష్టమి వైశాఖ శుద్ధ అష్టమీతిథిని అపరాజితాష్టమి అంటారు. ఈ రోజు శివ పార్వతులను యథాశక్తి అభిషేకము, పూజలతో సంతృప్తి పరచి పంచదారతో తయారు చేసిన పాయసం నివేదిస్తే సకలైశ్వర్యాలు లభిస్తాయి.