కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 08 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి మ.3.43 కు తదుపరి ద్వాదశి 9 సా.5.09 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తర రా.10.07 కు తదుపరి హస్త 9 రా.12.16 కు
యోగం: హర్షణ రా.1:56 కు తదుపరి వజ్ర 9 రా.2:57 కు
కరణం: విష్టి మ.12.29 కు తదుపరి బవ రా.1.41 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:05-10:56 కు, మ. 3:10-4:01 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.01:03 - 02:50 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చెయ్యాలి.
🕉️ వైశాఖ శుక్ల ఏకాదశి - మోహినీ ఏకాదశి, బృహస్పతి జయంతి, కంచి వరదరాజస్వామి ఆవిర్భావం, అన్నవరం శ్రీ సత్యదేవుని కల్యాణం🕉️
గురుబోధ:
🕉️ఈరోజు శివుడిని ద్రవ్యాలతో అభిషేకం చేయండి, విష్ణువునైతే గంధాలతో పూజించండి. షోడశ ఉపచారములు తప్పక చేయండి, శక్తిని అనుసరించి ఉపవాసం ఉండండి.
🕉️ఉపవాసము ఉన్న తర్వాత దానం చేయటం మంచిది కనుక స్వయంపాకం, స్వర్ణము, వెండి, వస్త్రాలు మొదలగునవి దానం చేయటం మంచిది.
🕉️మోహినీతిథి నాడు గురుపత్నికి గాని, అర్చకుల పత్నులకు గాని, మీ పురోహితుల భార్యలకు కానీ ఒక మంచి చీరను దానము చేస్తే మోహినీరూపంలో ఉన్న విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial