" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 08 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము తిథి : తదియ సా. 06గం౹౹18ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : జ్యేష్ఠ రా. 08గం౹౹27ని౹౹ వరకు తదుపరి మూల యోగం : శివ రా. 12గం౹౹10ని౹౹ వరకు తదుపరి సిద్ధ కరణం : వణిజ ఉ. 07గం౹౹19ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹03ని౹౹ నుండి 05గం౹౹34ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 11గం౹౹55ని౹౹ నుండి 01గం౹౹28ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹47ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹38ని౹౹కు 🕉️సంకటహరచతుర్థి🕉️ గురుబోధ గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహరచతుర్థీవ్రతం ఆచరిస్తారు. వినాయకుడు శీఘ్రంగా, తక్షణం కోరికలు తీరుస్తాడు. విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఉపాసించినా, పూజించినా ఆయన నామాలను తలచుకున్నా అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. మానవులు ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం సహజమే! మంచి పనులకి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. చెడ్డపని చేసేవాడికన్నా మంచిపని చేసేవాడిని భగవంతుడు ఎక్కువగా పరీక్షిస్తాడు. మంచిపని చేసేవాడికి అడుగడుక్కీ కష్టాలు వస్తాయి. మంచిపనులయందు విఘ్నములు ఎక్కువగా ఉంటాయి. విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడిని భక్తితో నిత్యం పూజించండి. పూజ చేయలేకపోతే కనీసం ఆయన నామాలనైనా జపించండి, తలచుకోండి. చతుర్థి తిథుల్లో వినాయకుణ్ణి భక్తితో పూజిస్తే వారికి ఎటువంటి విఘ్నాలు ఉండవు. అనుకున్న కోరికలు తీరుతాయి అని పార్వతీదేవి ప్రజలకు ఉపదేశించింది అని శివపురాణం గణేశఖండంలో ఉంది. అందువల్ల కలియుగంలో ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి.