"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 08 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: సప్తమి మధ్యాహ్నం 12గం౹౹52ని వరకు తదుపరి అష్టమి వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: పుష్యమి ఈ రోజు ఉదయం 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: గండ ఈ రోజు రాత్రి 08గం౹౹34ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : వణిజ ఈ రోజు సాయంత్రం 05గం౹౹00ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹38ని౹౹ నుండి 05గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం: ఈ రోజు రాత్రి 01గం౹౹09ని౹౹ నుండి 02గం౹౹52ని౹౹ వరకు అమృతకాలం: ఈ రోజు ఉదయం 06గం౹౹23ని౹౹ నుంచే 08గం౹౹08౹౹వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని౹౹ వరకు 👉🏻🕉️గంగావతరణం, భాను సప్తమి🕉️ గురుబోధ:- గంగావతరణం, భాను సప్తమి(పద్మకయోగం), శర్కరాసప్తమి ◆ వైశాఖశుక్లసప్తమీ తిథినాడు, జహ్నుమహర్షి గంగాదేవిని కుడిచెవి నుండి గంగను విడిచిపెట్టాడు. ఈ రోజు నర్మదా నదిలో గంగ ప్రవేశిస్తుంది. ఈ శ్లోకం తప్పక నిత్యం స్మరించాలి. నందినీ నిళినీ సీతా మాలినీ చ మహాపగా విఘ్ణణపాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ భాగీరథి భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ ◆ఈ తిథినాడు పంచదారతో చేసిన పిండివంటలు సూర్యునికి నివేదిస్తే, సకల దుఃఖాలు నశిస్తాయి. పుత్రసంతానం కలుగుతుంది