కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: దశమి మ.2.33 కు తదుపరి ఏకాదశి 8 మ.3.43 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుబ్బ రా.8.14 కు తదుపరి ఉత్తర 8 రా.10.07 కు
యోగం: వ్యాఘాత రా.1:04 కు తదుపరి హర్షణ 8 రా.1:56 కు
కరణం: గరజి ఉ.10.20 కు తదుపరి వణిజ రా.11.22 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:47-12:38 కు
వర్జ్యం: తె.4.00-5.42 కు
అమృతకాలం: ప.11:14-01:00 కు
సూర్యోదయం: ఉ. 5:35 కు
సూర్యాస్తమయం: సా. 6:17 కు
🕉️ శ్రీ వాసవాంబ జయంతి, వైశాఖ శుక్ల దశమి, పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిగిన పుణ్య తిథి🕉️
గురుబోధ:
శ్లో || దశమ్యాం మాధవే శుక్లే విష్ణుమభ్యర్చ మానవః |
లభతే వైష్ణవం లోకం నాత్ర కార్యా విచారణా ||
వైశాఖ శుక్ల దశమి నాడు విష్ణువును భక్తితో అర్చించిన మానవుడికి విష్ణులోకం లభిస్తుంది. ఏ సందేహం అక్కరలేదని, వైశాఖం నా సన్నిధినిచ్చే మాసం అనీ శ్రీహరి నారదునితో అంటాడు. శ్రీనివాసకల్యాణ ఘట్టం తప్పక వినడం సర్వమంగళదాయకం, సకలశుభప్రదం. వివాహం, అనుకూల దాంపత్యం, ఉద్యోగప్రాప్తి వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయి.
పూజ్యగురువుల స్కాందపురాణం ప్రవచనం నుండి - శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం 👇
PART 1 - https://youtu.be/ZydCT86KPjs?si=8mmT38uuuOeJiAcG
PART 2 - https://youtu.be/l-4W3lWcTH0?si=1tDfaywcPu8dBoOY
వాసవీ కన్యకాపరమేశ్వరీ మహిమ 👇
https://youtu.be/3ubkQEcXTSM?si=GvrydkLMA8IDclCq