కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ. 10.59 కు తదుపరి అమావాస్య
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అశ్విని మ. 3.15 కు తదుపరి భరణి
యోగం: ఆయుష్మాన్ రా. 08.59 కు తదుపరి సౌభాగ్య
కరణం: శకుని ఉ. 11.40 కు తదుపరి చతుష్పాద
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.21 - 09.13 కు & రా. 11.06 - 11.50 కు
వర్జ్యం: ఉ. 11.29 - 12.59 కు & రా. 12.21 - 1.52 కు
అమృతకాలం: ఉ. 8.28 - 9.58 కు
సూర్యోదయం: ఉ. 5.47 కు
సూర్యాస్తమయం: సా. 6.38 కు
గురుబోధ:
మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, తగిన విధంగా వాటిని పరిరక్షించడం చేసేవారిని చూసి దేవతలు, పితృదేవతలు సంతోషిస్తారు. వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం.