May 07 2023మే 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము

తిథి : విదియ రా. 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : అనూరాధ రా. 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : పరిఘ రా. 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  తైతుల ఉ. 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹37ని౹౹ నుండి 05గం౹౹28ని౹౹ వరకు
వర్జ్యం : రా. 02గం౹౹38ని౹౹ నుండి 04గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹00ని౹౹ నుండి 12గం౹౹34ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹17ని౹౹కు


🕉️శ్రీ నారద జయంతి🕉️

గురుబోధ
ధర్మరాజు భీష్ముడిని శత్రువులు లేని వారు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తాడు.  ఎందుకంటే దేవతలను రాక్షసులు ద్వేషిస్తారు. శివుడిని, కేశవుడిని, జగన్మాత ను కూడా ద్వేషించేవారు ఉంటారు. కానీ నారదుడు సకల లోక పూజ్యుడు. నారదమహర్షిని శత్రువుగా ఎవ్వరూ చూడరు. అంతటి మహాత్ముని వలననే రామాయణం, భాగవతం లాంటి పురాణములు వచ్చాయి. ప్రహ్లాద, ధ్రువ వంటి భక్తులును కూడా అనుగ్రహించాడు. నారదుని ప్రస్తావన లేని పురాణం లేదు. అంతటి గొప్ప నారదముని మనకు ప్రాత:స్మరణీయుడు. ఈ రోజు నారదమహర్షిని తలచుకొని భక్తిపూర్వకముగా నమస్కరించుకొని  నారదమహర్షికి సంబంధించిన కథని భక్తి శ్రద్ధలతో చదివితే చాలు నారదమహర్షి ఆశీర్వాదం మనకి లభిస్తుంది. 

expand_less