"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 07 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: షష్ఠి ఉదయం 11గం౹౹09ని వరకు తదుపరి సప్తమి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం: పునర్వసు ఈ రోజు ఉదయం 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం: శూల ఈ రోజు రాత్రి 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి గండ కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹27ని౹౹ నుండి 07గం౹౹17ని౹౹వరకు వర్జ్యం: ఈ రోజు సాయంత్రం 05గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం: ఈ రోజు ఉదయం 06గం౹౹16ని౹౹ నుంచే 07గం౹౹52౹౹వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹35ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని౹౹ వరకు గురుబోధ:- వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమీ తిథినాడు నర్మదా నదములో (ఓంకారేశ్వర జ్యోతిర్లింగము దగ్గర) గంగ ప్రవేశిస్తుంది. ఆ రోజు చేసే స్నానం సకల శుభప్రదము. అంత్యకాలంలో కైలాసం ప్రాప్తిస్తుంది. అందుకే ఆస్తికలు చితా భస్మం అక్కడ కలపడం అత్యంత పుణ్యప్రదం - శ్రీ శివ మహాపురాణం