May 06 2023మే 06 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 06 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణ పక్షము

తిథి : పాడ్యమి రా. 10గం౹౹09ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : విశాఖ రా. 09గం౹౹40ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : వ్యతీపాత ఉ. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  బాలవ ఉ. 10గం౹౹31ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹36ని౹౹ నుండి 07గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹35ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹50ని౹౹ నుండి 02గం౹౹25ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹17ని౹౹కు

🕉️శ్రీశ్రీశ్రీ కంచిపరమాచార్య వారి 130వ జయంతి🕉️

గురుబోధ
గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు అందుకే గురుః సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అమ్మవారికి కూడా గురుమూర్తిః అని ప్రత్యేక నామం లలితాసహస్రనామంలో ఉన్నది. సప్తమోక్షపురాలలో ఒకటైన కాంచీపురం కంచిపీఠానికి శంకరగురుపరంపరలో నడచేదైవమై అశేషభక్తులను తరింపజేసిన మహాగురువు, సద్గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు. అటువంటి పరమగురువును తలచుకొని, వారి ధర్మబోధలను విని ఆచరించడం మనందరి కర్తవ్యం. జయజయశంకర హరహరశంకర*



expand_less