May 06 2022మే 06 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 06 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  పంచమి  ఉదయం 09గం౹౹01ని వరకు తదుపరి షష్ఠి 
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆరుద్ర  ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం:  ధృతి ఈ రోజు  రాత్రి 07గం౹౹07ని౹౹ వరకు తదుపరి శూల
కరణం  : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹08ని౹౹ నుండి 08గం౹౹59ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 07గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం: లేదు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹17ని౹౹  

👉🏻🕉️శంకర భగవత్ పాదుల జయంతి, గాయత్రీమాత జయంతి 🕉️

గురుబోధ:-
భక్తులు, సామాన్యజనులు తరించాలని జగద్గురువులు ఆదిశంకరులు ఎన్నో దేవతాస్తోత్రాలు, వేదాంత గ్రంథములకు భాష్యాలు అందించారు.ధర్మరక్షణకు జగద్గురు పీఠములను స్థాపించారు. ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేశారు. ఇన్ని చేసిన శంకరులను
మనము నిత్యం స్మరించుకోవడం,  స్తోత్రాలను పఠించడం, వారు చెప్పిన మార్గములో నడవడము వల్ల మనం తరించగలం.


expand_less