కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 05 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్థి 6 తె.4.52 కు తదుపరి పంచమి పూర్తి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.41 కు తదుపరి మూల 6 ప.1.16 కు
యోగం: శివ పూర్తి తదుపరి సిద్ధ 6 రా.1:11 కు
కరణం: బవ సా.6:38 కు తదుపరి కౌలవ 6 రా.9:04 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.24 - 9.15 కు, రా. 11.04 - 11.49 కు
వర్జ్యం: రా.7.33 - 9.19 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
🕉️ సంకష్టహరచతుర్థి, భౌమచతుర్థి 🕉️
గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతి మాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.
చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు.
ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo
శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రము👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
శ్రీ గణేశ భుజంగ స్తోత్రము👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial