కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 05 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి మ. 3.36 కు తదుపరి త్రయోదశి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా. 6.15 కు తదుపరి రేవతి
యోగం: వైధృతి ఉ. 07.37 కు తదుపరి విష్కంభ
కరణం: కౌలవ ఉ. 07.11 కు తదుపరి తైతుల
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.55 - 05.46 కు
వర్జ్యం: తె. 5.28 - 6.21 కు
అమృతకాలం: మ. 1.46 - 3.15 కు
సూర్యోదయం: ఉ. 5.48 కు
సూర్యాస్తమయం: సా. 6.38 కు
👉🕉️ ప్రదోషం 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
ఆదివారం, శుక్రవారం, మంగళవారాలు తులసి, బిల్వపత్రాలు కోయరాదు.
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.