" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము
తిథి : పూర్ణిమ రా. 10గం౹౹49ని౹౹ వరకు తదుపరి పాడ్యమివారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : స్వాతి రా. 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి విశాఖయోగం : వజ్ర ఉ. 09గం౹౹17ని౹౹ వరకు తదుపరి వ్యతీపాతకరణం : విష్టి ఉ. 11గం౹౹27ని౹౹ వరకు తదుపరి బవరాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹09ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : రా. 03గం౹౹13ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹16ని౹౹కు
🕉️వైశాఖ పూర్ణిమ, శ్రీ కూర్మావతార ఆవిర్భావతిథి, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మతిథి🕉️
గురుబోధ
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు పూర్ణిమ తిథి వచ్చినప్పుడు లక్ష్మీఆవిర్భావం, లక్ష్మీనారాయణుల వివాహఘట్టం వినడం సకలశుభప్రదం, సర్వసంపత్ప్రదాయకం.
శ్లో|| వైశాఖ్యామపి పూర్ణాయాం, దానం సర్వస్వ సర్వదమ్|
ధర్మరాజ వ్రతం చాత్ర కథితం తన్నిశామయ||
వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన పూర్ణిమ. ఈనాడు యమధర్మరాజును భక్తితో పూజించి నీటితో నింపిన పాత్రను శక్తిని బట్టి వెండి, రాగి లేక మట్టిది దానం చేసిన వారికి గోదానఫలం లభిస్తుంది. ధర్మజ్ఞానము కలుగుతుంది. అన్నదానం చేసిన వానికి భూదానఫలితం లభిస్తుంది. ఈ వ్రతాచరణ చేసినవాడు యముని చేత గౌరవింపబడతాడు.