May 05 2022మే 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 05 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  చతుర్థి  ఉదయం 07గం౹౹08ని వరకు తదుపరి పంచమి 
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆరుద్ర  ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం:  సుకర్మ ఈ రోజు  సాయంత్రం 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం  : విష్టి ఈ రోజు ఉదయం 10గం౹౹00ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01గం౹౹11ని౹౹ నుండి 02గం౹౹57ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 07గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు 

భగవద్  రామానుజాచార్యుల  జయంతి

గురుబోధ:-

శ్రీ భగవద్  రామానుజాచార్యులు (ఆరుద్ర నక్షత్రం) మఱియు శ్రీ ఆదిశంకరాచార్యులు (మృగశిర నక్షత్రం) ఇరువురి జన్మతిథి వైశాఖ శుక్లపంచమి. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జన్మనక్షత్రం నాడు జయంతి చేయగా స్మార్త సంప్రదాయం ప్రకారం జన్మ తిథిన జయంతి ఉత్సవాలు చేస్తారు. అందుకే వైశాఖమాసం ఆశ్లేష నక్షత్రం నాడు శ్రీ రామానుజుల జయంతి కాగా శుక్లపంచమి శ్రీ శంకర భగవత్ పాదుల జయంతి. 


expand_less