May 04 2025మే 04 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి మ.2.15 కు తదుపరి అష్టమి 5 మ.1.56 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి సా.5.39 కు తదుపరి ఆశ్లేష 5 సా.6.02 కు
యోగం: గండ రా.12:41 కు తదుపరి వృద్ధి 5 రా.12:19 కు
కరణం: వణిజ ఉ.7.19 కు తదుపరి విష్టి రా.7.21 కు
రాహుకాలం: సా. 4.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:51-5:42 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 06:24 - 08:01 కు
సూర్యోదయం: ఉ. 5:37 కు
సూర్యాస్తమయం: సా. 6:16 కు

🕉️ గంగోత్పత్తి, గంగావతరణం, భానుసప్తమి, నర్మదానద స్నానం, వైశాఖ సప్తమి, శర్కరాసప్తమి, భగీరథ జయంతి, పుష్యార్కయోగము🕉️

భానుసప్తమి, శర్కరాసప్తమి, ఆదివారం సాయంత్రం అష్టమీతిథి, ఆశ్లేషానక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీప్రణవపీఠం, హైదరాబాద్ (భాగ్యనగరం)లో సా.4.30 గం.ల నుండి 7.00 గం.ల వరకు రుద్రాభిషేకం, రాహుకేతుపూజా కార్యక్రమాలు ఉంటాయి.

గురుబోధ:
👉వైశాఖశుక్లసప్తమీ తిథినాడు, జహ్నుమహర్షి గంగాదేవిని కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. ఈ రోజు నర్మదానదిలో గంగ ప్రవేశిస్తుంది. ఈ తిథినాడు పంచదారతో చేసిన పిండివంటలు సూర్యునికి నివేదిస్తే, సకల దుఃఖాలు నశిస్తాయి. పుత్రసంతానం కలుగుతుంది.
👉ఈరోజు బాణలింగాన్ని ఆవుపాలతో పూజించి, ఆ క్షీరాన్ని నెత్తిపై చల్లుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వేల జన్మల పాపాలు తొలగుతాయి.
👉ఈరోజు నర్మదానదములో 3 కోట్ల నదులు చేరుతాయి. కావున ఈరోజు ఓంకారేశ్వరంలో ఉన్న నర్మదానదములో స్నానం చేయాలి లేదా శ్రీశైలం లో మల్లికార్జునస్వామికి అభిషేకం చేసిన జలములు స్వీకరించినా వేల జన్మల పాపాలు పోతాయి.
👉శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సమానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వరకారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి. నేడు సమీపనదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగానామస్మరణ చేయాలి.
👉ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.

expand_less