కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి సా. 6.04 కు తదుపరి ద్వాదశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా. 7.55 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: ఐంద్ర ఉ. 11.04 కు తదుపరి వైధృతి
కరణం: బవ ఉ. 10.03 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.49 - 07.31 కు
వర్జ్యం: తె. 4.52 - 6.22 కు & ఉ. 8.44 - 10.14 కు
అమృతకాలం: మ. 12.28 - 1.57 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
👉🕉️ చైత్ర కృష్ణ ఏకాదశి 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు చేయాలి.
గురుబోధ:
ఏకాదశిని విష్ణుతిథి అని, ద్వాదశిని హరివారం అని పిలుస్తారు. ఏకాదశి అని పేరు వినగానే యమకింకరులు భయపడతారు అని పద్మ పురాణం చెపుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రోజు ఉపవాసం ఉండి, తలస్నానం చేసి శ్రీ విష్ణుసహస్రనామములు పారాయణ చేసి భక్తితో గురువును సేవిస్తే పొరపాటున కూడా యమకింకరులు దగ్గరకి రాలేరు. ఈ ఏకాదశీ వ్రతం చేయడం వలన భయంకరమైన దోషాలు కూడా నశిస్తాయి. ఈ రోజు శివునికి మరియు విష్ణువునకు అభిషేకం చేయాలి. శ్రీ సూక్తం, పురుషసూక్తంతో, తులసీదళాలతో శివకేశవులను అర్చన చేయడం చాలా మంచిది.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX