May 04 2023మే 04 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము

తిథి : చతుర్దశి రా. 11గం౹౹05ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : బృహస్పతి వారం (గురువారం)
నక్షత్రం : చిత్త రా. 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : వజ్ర ఉ. 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  గరజి ఉ. 11గం౹౹51ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹50ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు & మ. 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹34ని౹౹ నుండి 06గం౹౹04ని౹౹ వరకు & రా. 02గం౹౹50ని౹౹ నుండి 04గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : మ. 02గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹06ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹16ని౹౹కు

🕉️వైశాఖ శుక్ల చతుర్దశి - నృసింహస్వామి ఆవిర్భావతిథి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మతిథి🕉️

గురుబోధ

ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం |
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ||



వైశాఖ శుక్ల చతుర్దశి శ్రీనృసింహచతుర్దశి. ఈ తిథినాడు నరసింహస్వామిని భక్తితో అర్చిస్తే ఏ విధమైన శత్రుపీడ ఉండదు. నృసింహ జయంతి రోజున ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి నాడు అందరం ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించి తరిద్దాం. నరసింహస్వామి వారు అహోబలంలో తొమ్మిదిమంది నారసింహులుగా మనకు దర్శనమిస్తారు. 

ఈరోజు పారాయణం చేయవలసిన నృసింహ కరావలంబ స్తోత్రం గురుదేవులు మనకి అందించిన యూట్యూబ్ లింక్👇🏻👇🏻



expand_less