May 03 2026మే 03 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 03 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ రా.12.49 కు తదుపరి తదియ 4 రా.2.51 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అనూరాధ 4 ఉ.8.04 కు తదుపరి జ్యేష్ఠ 5 ఉ.10.41 కు
యోగం: వరీయాన్ 3 రా.10:27 కు తదుపరి పరిఘ 4 రా.11:19 కు
కరణం:
తైతుల మ.1:54 కు తదుపరి వణిజ 4 సా.4:12 కు
రాహుకాలం:
సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం:
సా. 4.51 - 5.42 కు
వర్జ్యం:
ఉ.10.01 - 11.47 కు
అమృతకాలం:
రా. 10.19 - 12.07 కు
సూర్యోదయం:
ఉ. 5.53 కు
సూర్యాస్తమయం:
సా. 6.33 కు

గురుబోధ:*
యోగేశ్వరుడయిన శ్రీకృష్ణుని స్వరూపం భాగవతం. అందుకే కృష్ణుడే భాగవతమని, భాగవతమే కృష్ణుడని పెద్దలు పలుకుతుంటారు. భాగవత మహిమని అన్ని పురాణాలు వర్ణించాయి. భాగవతమే భగవంతుడని గ్రహించిన వాడే పరమభక్తుడు. మానవునిలో సమస్తపాపాలను పటాపంచలు చేసి భగవత్ భక్తిని ప్రకాశింపజేసే "సుదర్శనం" శ్రీమద్భాగవతం. మానవ జీవితంలోని భయంకర దారిద్ర్య దుఃఖాలను పారద్రోలే "రుక్మిణీకృష్ణస్వరూపం" శ్రీమద్భాగవతం. ఒక్క భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడి వంశంలో 21 తరాలు పూర్వం, మరియు రాబోయే 21 తరాలు అంతా వైకుంఠానికి వెడతారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less