కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟మే 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి రా. 8.28 కు తదుపరి ఏకాదశి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శతభిషం రా. 9.34 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: బ్రహ్మ మ. 02.19 కు తదుపరి ఐంద్ర
కరణం: వణిజ మ. 12.40 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.23 - 09.14 కు & మ. 12.39 - 01.30 కు
వర్జ్యం: తె. 3.31 - 5.01 కు & ఉ. 5.21 - 7.21 కు
అమృతకాలం: మ. 2.51 - 4.20 కు
సూర్యోదయం: ఉ. 5.49 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
గురుబోధ:
కష్టకాలంలో అందరికీ ముందుగా గుర్తు వచ్చేది గురువు. అప్పుడు గురువును ఆశ్రయించి సేవిస్తారు. కాలక్రమేణా వారికి గురు అనుగ్రహము లభించి చనువు ఏర్పడుతుంది. గురుకటాక్షంతో అనుకున్న కోరికలు తీరి, కీర్తి లభించాక, ఇక గురువుతో తనకేమీ పనిలేదు అని భావిస్తారు, ఇదే అజ్ఞానము. చనువు పెరిగే కొలదీ అణిగిమణిగి ఉండాలి, లేదంటే భ్రష్టత్వమును పొందుతారు. శిష్యుడు ఎలా ఉండాలి అన్న దానికి ఉదాహరణ శంకరభగవత్పాదుల వారి ప్రముఖశిష్యుడైన పద్మాపాదాచార్యుల వారే.