" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 03 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము తిథి : త్రయోదశి రా. 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : హస్త రా. 06గం౹౹35ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : హర్షణ ఉ. 11గం౹౹28ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : కౌలవ ఉ. 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹24ని౹౹ నుండి 05గం౹౹37ని౹౹ వరకు అమృతకాలం : మ. 01గం౹౹41ని౹౹ నుండి 03గం౹౹23ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹37ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹16ని౹౹కు గురుబోధ నవగ్రహ దేవతలు కాశీలో గొప్ప తపస్సు చేసి తమ పేరు మీద లింగాన్ని ప్రతిష్ఠించి గ్రహాధిపత్యం పొందారు. మన పూర్వజన్మ పుణ్యపాప కర్మలను అనుసరించి మాత్రమే తగిన శుభ లేదా అశుభ ఫలితాలని ఇస్తారు. వారిని నిత్యం స్మరించడం, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పక ప్రదక్షిణ, నమస్కారాలు చేసాక మాత్రమే ప్రధాన దేవతామూర్తిని దర్శించాలని శాస్త్రం చెపుతున్నది.