May 03 2023జూన్ 03 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూన్ 3 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి ఉ. 10గం౹౹16ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : విశాఖ ఉ. 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : శివ మ. 02గం౹౹48ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  వణిజ ఉ. 11గం౹౹16ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹28ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹27ని౹౹కు


గురుబోధ
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతా పూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య , సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు  నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచరించే అర్హత కలుగుతుందని శాస్త్రం.

expand_less