కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: బ.పాడ్యమి రా.11.01 కు తదుపరి విదియ 3 రా.12.49 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: విశాఖ 3 తె.5.38 కు తదుపరి అనూరాధ 4 ఉ. 8.04 కు
యోగం: వరీయాన్ రా.10:27 కు తదుపరి పరిఘ 3 రా.11:19 కు
కరణం: కౌలవ రా.12:50 కు తదుపరి తైతుల 3 మ.1:54 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.34 - 8.25 కు
వర్జ్యం: ఉ.9.31 - 11.16 కు
అమృతకాలం: సా. 09.24 - 11.10 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.32 కు
🕉️ అన్నమాచార్య జయంతి, నారద జయంతి , శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్యస్వామివారి 133 వ జయంతి🕉️
గురుబోధ:
🕉️ధర్మరాజు భీష్ముడిని శత్రువులు లేని వారు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే దేవతలను రాక్షసులు ద్వేషిస్తారు. శివుడిని, కేశవుడిని, జగన్మాత ను కూడా ద్వేషించేవారు ఉంటారు. కానీ నారదుడు సకల లోక పూజ్యుడు. నారదమహర్షిని శత్రువుగా ఎవ్వరూ చూడరు. అంతటి మహాత్ముని వలననే రామాయణం, భాగవతం లాంటి పురాణములు వచ్చాయి. ప్రహ్లాద, ధ్రువ వంటి భక్తులును కూడా అనుగ్రహించాడు. నారదుని ప్రస్తావన లేని పురాణం లేదు. అంతటి గొప్ప నారదముని మనకు ప్రాత:స్మరణీయుడు. ఈ రోజు నారదమహర్షిని తలచుకొని భక్తిపూర్వకముగా నమస్కరించుకొని నారదమహర్షికి సంబంధించిన కథని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసినా, చదివినా చాలు నారదమహర్షి ఆశీర్వాదం మనకి లభిస్తుంది.
https://youtu.be/sWfTFKbvSds?si=MqsUsJQNfUpN2Mbw
https://youtu.be/bXOJZTPrz00?si=IQTj-im1owQI62yo
🕉️గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు అందుకే గురుః సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అమ్మవారికి కూడా గురుమూర్తిః అని ప్రత్యేక నామం లలితాసహస్రనామంలో ఉన్నది. సప్తమోక్షపురాలలో ఒకటైన కాంచీపురం కంచిపీఠానికి శంకరగురుపరంపరలో నడచేదైవమై అశేషభక్తులను తరింపజేసిన మహాగురువు, సద్గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు. అటువంటి పరమగురువును తలచుకొని, వారి ధర్మబోధలను విని ఆచరించడం మనందరి కర్తవ్యం. జయజయశంకర హరహరశంకర
https://youtu.be/nuaQpE4oGkw
🕉️తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మెుదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు ) అన్నమయ్య. పదకవితా పితామహుడైన ఆయన శ్రీనివాసునిపై కూర్చిన అనేక భక్తిగేయాలు తెలుగువారందరికీ హృదయకంఠస్థానాలలో కొలువయ్యాయి.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial