కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి సా.5.36 కు తదుపరి షష్ఠి 3 మ.3.07 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆరుద్ర సా.6.34 కు తదుపరి పునర్వసు 3 సా.5.46 కు
యోగం: ధృతి 3 తె.3:19 కు తదుపరి శూల రా.1:40 కు
కరణం: బాలవ ఉ.8.15 కు తదుపరి కౌలవ రా.8.27 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:25-9:15 కు, మ. 12:38-1:29 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ.8.44 - 10.16 కు
సూర్యోదయం: ఉ. 5:40 కు
సూర్యాస్తమయం: సా. 6:14 కు
🕉️ శ్రీ శంకరభగవత్పాదుల వారి జయంతి , శ్రీ రామానుజాచార్యుల వారి జయంతి, గాయత్రీమాత అవతరణము శ్రీ భగవద్ రామానుజాచార్యులు (ఆరుద్ర నక్షత్రం) మఱియు శ్రీ ఆదిశంకరాచార్యులు (మృగశిర నక్షత్రం) ఇరువురి జన్మతిథి వైశాఖ శుక్లపంచమి. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం జన్మనక్షత్రం నాడు జయంతి చేయగా స్మార్త సంప్రదాయం ప్రకారం జన్మ తిథిన జయంతి ఉత్సవాలు చేస్తారు. అందుకే వైశాఖ మాసం ఆరుద్ర నక్షత్రం నాడు శ్రీ రామానుజుల జయంతి కాగా శుక్లపంచమి శ్రీ శంకర భగవత్ పాదుల జయంతి. అయితే ఈసారి రెండూ ఒకేరోజు రావడం మన అదృష్టం.🕉️
గురుబోధ:
సనాతన వైదిక ధర్మమార్గాన్ని నిర్దేశించడానికి గురుస్వరూపుడిగా పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యునిగా అవతరించారు. ధర్మోద్ధరణ కొరకై అద్వైత సిద్ధాంతాలతో ఎన్నో భాష్యములు, స్తోత్రములు సరళంగా రచించారు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవింద స్తోత్రం లాంటి ఎన్నో గొప్ప స్తోత్రములను మనకు అందించారు. దేవీదేవతల మీద వారు చేసిన స్తోత్రాలు, వేద ఉపనిషత్తుల మీద భాష్యములు, ఇతర సాహిత్య గ్రంథరచనములు తెలుసుకుని అర్థం చేసుకోవడానికి జీవితకాలం కృషిచేసినా సరిపోదు. నేడే మరొక విశేషం, సాక్షాత్ ఆదిశేషుడే శ్రీ రామానుజాచార్యులుగా అవతరించారు. అటువంటి ఈ ఇద్దరు మహాత్ములు ప్రాతః స్మరణీయులు.
https://www.youtube.com/watch?v=1imLfk12hIQ&pp=ygUhdmFkZGlwYXJ0aSBwYWRtYWthciB0b3Rha2FzaHRha2Ft